ఐ మిస్ యు ఐ లవ్యూ కోట్స్ తెలుగు

ఐ మిస్ యు ఐ లవ్యూ కోట్స్ తెలుగు
ఐ మిస్ యు ఐ లవ్యూ కోట్స్ తెలుగు

ఐ మిస్ యు ఐ లవ్యూ కోట్స్ తెలుగు కదిలే కాలం కష్టం తెస్తుంది అయినా ఇష్టమైనవారు ప్రక్కనే ఉంటే కష్టం కాలంలో కరిగిపోతుంది. కష్టకాలం కూడా ఇష్టంగా సాగిపోతుంది. జీవిత మాధుర్యం అయితే అందులో ప్రధాన పాత్ర పార్టనర్ దే అవుతుంది.

అటువంటి జీవిత భాగస్వాముల గురించి ఆలోచన ఎప్పుడూ ఉంటుంది. ఇక వారు దూరంగా ఉన్నప్పుడు మాత్రం కాలం భారంగా కదులుతుంది. కష్టం లేకపోయిన కష్టంలో కూరుకుపోయినట్టుగా అనిపించడమే… మనసుకు దగ్గరయినవారు చేసే మాయ.

మనకు ఇష్టమైనవారు మన చెంత ఉంటే చింతకు తావుండదని అంటారు. అలాంటి మనకు ఇష్టమైనవారికి ఇష్టంతో నాలుగు పదాలు చెప్పుకోవాలసి వస్తే, ఆ నాలుగు మాటలు వారి మనసును తాకేలాగా ఉంటే, అది వారికి మరింత ఆనందదాయకం.

ఒక్క క్షణం నిన్ను విడిచి ఉండలేను అనే చెప్పడానికి కూడా మాటలు కదలని స్థితిలో మనసు వెళ్ళిపోయింది. అంటే ఈ పదాలు నేను చెప్పేవి కావు నాలో ఉన్న నీవు నీకోసం చెప్పుకుంటున్న మాటలు…

మదిలో మెదిలే ప్రియతమా…
ఐ మిస్ యు ఐ లవ్యూ కోట్స్ తెలుగు

కలగన్నా కలగన్నా కలలోనైనా కానరాలేదు కానీ కంటి ముందు కనిపించావు, నా మనసంతా వ్యాపించావు, నన్ను నేను మరిచాను.

ప్రియతమా నా హృదయమా…

నీవు కలవకముందు నేను అనే పదానికి ఎన్నో భావాలు, నీవు కలిశాక నేను అనే పదానికి నీవు అనే తలంపు ఒక్కటే…

మనసంతా నిండిపోయిన ప్రియతమా….

గడుస్తున్న కాలం గడ్డుకాలం ఎందుకంటే నీవు చెంతలేని కాలం కనుక

నా సమయాన్ని లాగేసుకున్న ప్రియతమా….

అర్ధవంతంగా మాట్లాడడానికి నేను ఉపన్యాసకుడుని కాదు ప్రేమికుడిని… కాబట్టి పదాలు చూడకు నా హృదయం చూడు.

నీవు లేని జీవితం ఊహకందని నా మనసు

కలొస్తే, ఆ కలలోనూ నీవు ఉంటావు, మెలుకువ వస్తే నీవు ముందుంటావు. నిత్యం నాతో ఉండే నీవు దూరంగా ఉన్నావంటే నమ్మబుద్దికావడం లేదు.

ఆలోచనలన్నీ నీ గురించే
ఇలలో ఉన్నంతకాలం కల కంటున్నంతకాలం నీకు నా మదిలో గూడు కట్టుకుని ఉంటావు.

ఇలలో ఉన్నంతకాలం కల కంటున్నంతకాలం నీవు నా మదిలో గూడు కట్టుకుని ఉంటావు.

ప్రేమ నీ ప్రియనేస్తం

నా మనసుకు బాధ అనేది తెలుసు కానీ అది దూరం అయ్యి చాలా కాలం అయింది. ఎందుకంటే నీ పరిచయం అయి చాలా కాలం గడిచింది.

ప్రియా ప్రియతమా నీవు కుశలమా…
ఐ మిస్ యు ఐ లవ్యూ కోట్స్ తెలుగు
ఐ మిస్ యు ఐ లవ్యూ కోట్స్ తెలుగు

సాధించాలనే తపన కార్యనిర్వహణలో ఉంటుంది. పొందాలనే తపన అందంపై ఆధారపడి ఉంటుంది. మంచి చేయాలనే తపన గుణమును బట్టి ఉంటుంది. గెలవాలనే తపన ఎంచుకున్న అంశమును బట్టి ఉంటుంది. గెలుపు ఓటమిలకు అతీతంగా నీ సాన్నిహిత్యంలో ఉండాలనిపిస్తుంది.

నా హృదయంలో వెలిసిన

నాకు నీతోడు జీవితం, నాకు నీకు మద్య దూరం శూన్యం అదే మనిద్దరి జీవనం.

ప్రియతమా నా హృదయమా…
ఐ మిస్ యు ఐ లవ్యూ కోట్స్ తెలుగు

నీతో కలిసి ఉన్నంతకాలం కాలం ఇట్టే కరిగిపోతుందంటే నీవంటే ఎంత ఇష్టమో కాలమే చెబుతుంది కదా నీవు దూరంగా ఉన్నంతకాలం క్షణమొక యుగమంటే, నీ ఎడబాటు నాకు శాపం అవుతుంది.

నా జీవిత భాగస్వామి నా హృదయంలో

కదిలే కాలం కష్టాలు తెచ్చినా భరించాను కానీ కదిలే కాలం నీ ఎడబాటును తెస్తే భరించలేకుండా ఉన్నాను.

ప్రియతమా నా హృదయనేస్తమా…
ఐ మిస్ యు ఐ లవ్యూ కోట్స్ తెలుగు
ఐ మిస్ యు ఐ లవ్యూ కోట్స్ తెలుగు

ఏదో ఒక బంధం దూరం అయితే ఏదో వెలితిగా అనిపిస్తుంది కానీ నీవు దూరం అయితే జీవితం లేనట్టుంది.

ప్రియతమా నా హృదయమా

కాలం గడిచే కొద్దీ బంధం బలపడుతుంది… అయిష్టాలు ఇష్టంగా మారతాయి… కానీ ప్రతి ఇష్టంలోనూ నీ ఇష్టం కనబడడమే విడ్డూరంగా ఉంది.

నా హృదయ గెలిచిన ప్రియతమా

ప్రధాని పదవి కావాలనో సిఎం పదవి కావాలనో జీవితానికో లక్ష్యం లేకుండా ఎలా ఉంటున్నారని అనుకునే నాకు నీ పరిచయం తర్వాత తెలిసింది. అలాంటి పదవులకన్నా పెద్ద పదవి ప్రియతమ హృదయంలో సింహాసనంపై కూర్చోవడం అని…

నా హృదయంలోని ప్రియతమా…

జీవితానికో లక్ష్యం ఏర్పడడానికి ఎవరి సాధన వారికి ఉపయోగపడుతుంది. కానీ నీ ఆశయం నా జీవితాశయం అయిపోయింది… మరి నాతోడుగా ఉండే నీవు కొద్దికాలం ఎడబాటు అంటే, నేను భరించడం కష్టమే.

నా హృదయపు సింహాసనం అధిష్టించిన

నీ పరిచయానికి ముందు నేను కవిని కాను కానీ ఇప్పుడు నాలో కవిత్వం పొంగి పొరలుతుంది.

అది నీ సాంగత్య మహిమే…
ఐ మిస్ యు ఐ లవ్యూ కోట్స్ తెలుగు
ఐ మిస్ యు ఐ లవ్యూ కోట్స్ తెలుగు

ప్రణామం ప్రణామం నిన్ను కన్న నీ తల్లిదండ్రులకు, ప్రణయం ప్రణయం నీకు నాకు మద్య రాదు మన మద్య ఏ అడ్డంకి…

ప్రియతమా నా హృదయంలో నిదురించే చెలియా…

మనసు మనసు మాట్లాడుకోవడం అంటే కళ్ళతో కళ్లు మాట్లాడుకోవడం అంటూ ఉంటుంటే వింటుండడమే జరిగేది కానీ నేడు నీ పరిచయంతో అనుభవిస్తున్నాను…

నా మనసులో నిలిచిన ప్రియతమా…

తనువుకు – తనువుకు మనువు అయితే మరి ఆ రెండు మనసులు ముడిపడి జతకడతాయి కానీ నా మనసు ముందుగానే నీ మనసుతో ముడిపడింది… మరి నీమనసు ఎప్పుడు నా మనసుతో జతకడుతుంది?

ఓ నా ప్రియనేస్తమా….
ఐ మిస్ యు ఐ లవ్యూ కోట్స్ తెలుగు

కళ్ళు కళ్ళతో పెనవేసుకుపోతే అదేదో అంతర్యంలో జరిగే సంఘర్షణ అయితే ఆ సంఘర్షణకు మూలం నీ చూపే… చూపే బంగారమాయే…

తొలిచూపుతోనే నా మనసు దోచిన ప్రియతమా…

తింటున్నప్పుడు తిండి ధ్యాస లేదు. పడుకుంటున్నప్పుడు నిద్ర ధ్యాసలేదు. ఈ జీవితానికి ఏ ధ్యాస లేకుండా పోయింది. కానీ నీవు నాజీవితంలోకి వస్తే మనిద్దరి ధ్యాస ఒక్కటే అయితే అదే మన జీవితం.

నా హృదయేశ్వరి…
ఐ మిస్ యు ఐ లవ్యూ కోట్స్ తెలుగు

ఏదో తెలియని వెలితి వెంటాడుతున్న కాలంలో చాలాకాలం బ్రతికేశాను…. కానీ కాలం పరిపూర్ణమైన తృప్తినిస్తుంది… కారణం నీ రాక నా మనసులో మార్పుకు నాంది.

ఓ ప్రియతమా… నా హృదయమా…

కనికరిస్తే కనకదుర్గలాగా ఉంటారు. ఆగ్రహిస్తే అమ్మవారిలాగా ఉంటారు. కానీ ప్రేమిస్తే నీలాగానే ఉండడం ఎవరికి సాధ్యం?

ఓ నా చెలియా నాకు మాత్రమే కలిగిన అదృష్టమా….

ఎటుచూసినా నీ రూపమే అంటూ పల్లవించే పలువురిని చూసి నవ్వుకునే నాకు నీ పరిచయంతో మనసంతా నీ రూపమే ఇక చూడడానికి దిక్కెక్కడా…

ఓ ప్రియతమా…
ఐ మిస్ యు ఐ లవ్యూ కోట్స్ తెలుగు

ప్రతి పరిచయం పరిమితమే అవుతుంది… కానీ నీ పరిచయం జీవితాంతము… అందుకేనోమే ఎప్పటికీ మన బంధం బలపరిచే ఆలోచనలే కలుగుతుంటాయి… అవి నీకు నాకు మద్య వారధి వంటివి.

నా ప్రియనేస్తమా…

లవ్ కోట్ వ్రాయడానికి కవిని కాను కానీ నీ పరిచయంతో ప్రేమతత్వం వికసించింది. నా హృదయంలో శాంతిని తెచ్చే నీ చూపు జీవితపర్యంతము తోడుగా ఉండాలి.

ప్రియతమా…

రెండు మనసులు విడిగా ఉండడం జరిగితే అది మన పరిచయానికి ముందు, మన పరిచయం అయ్యాక రెండు శరీరములలో ఒకే మనసు మిగిలింది.

ఐ మిస్ యు ఐ లవ్యూ కోట్స్ తెలుగు
ఐ మిస్ యు ఐ లవ్యూ కోట్స్ తెలుగు

నాకోసమే పట్టావని నాకనిపిస్తుంది… కానీ నీకు కూడా అదే భావన బలపడితేనే నా ఆలోచన కొనసాగుతుంది… అలా కాకపోతే ఈ జీవితానికి మిగిలేది అర్ధరహిత జీవనమే…

నా జీవిత భాగస్వామి స్వాగతం.

పదవీ విరమణ శుభాకాంక్షలు ఉద్యోగ విరమణ సందర్భంగా

బర్త్ డే విషెస్ కోట్స్ తెలుగులో Birth day wishes in Telugu

హ్యాపీ మ్యారేజ్ డే విషెస్ కోట్స్ తెలుగు

హ్యాపీ బర్త్ డే విషెస్ టు సిస్టర్

బ్రదర్ కు హ్యాపీ బర్త్ డే విషెస్

ఫాదర్ కు బర్త్ డే విషెస్ కోట్స్

మదర్ బర్త్ డే విషెస్ కోట్స్

హ్యాపీ బర్త్ డే మై సన్

విష్ యు హ్యాపీ బర్త్ డే టు మై డాటర్

హ్యాపీ బర్త్ డే విషెస్ టు ఫ్రెండ్

దర్శించండి తెలుగురీడ్స్.కామ్ బ్లాగ్

సందర్శించండి తెలుగులో వ్యాసాలు కొరకు