హ్యాపీ మ్యారేజ్ డే విషెస్ కోట్స్ తెలుగు

హ్యాపీ మ్యారేజ్ డే విషెస్ కోట్స్ తెలుగు
హ్యాపీ మ్యారేజ్ డే విషెస్ కోట్స్ తెలుగు

హ్యాపీ మ్యారేజ్ డే విషెస్ కోట్స్ తెలుగులో పెళ్ళిరోజు శుభాకాంక్షలు నూతన దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు. కొత్తగా పెళ్లైన దంపతులకు పాత దంపతులు కురిపించే శుభాకాంక్షలు పెళ్ళిసందడిలో ఉంటుంది. ఇంకా వివాహమైనా ఏడాదికి పెళ్ళిరోజును గుర్తు పెట్టుకుని మరీ విషెస్ తెలియజేయడం జరుగుతుంది. అందులోనూ మొదటి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలపని బంధం ఉండదు.

అలా న్యూ మ్యారీడ్ కపుల్స్ మ్యారేజ్ డే విషెస్ తెలియజేయడానికి కొన్ని పెళ్ళి రోజు శుభాకాంక్షలు తెలుగులో

ఎప్పుడూ ఒక్కరి మాటే నెగ్గడం వలన ఆ ఒక్కరూ పాడైపోతారని భావించి, ఇద్దరిని ఒక్కటి చేస్తే ఒకరిపైఒకరు పైచేయి సాధిస్తూ, చివరికి ఒక మనసుగా మిగులుతారని పెళ్ళి కనిపెట్టి ఉంటారు. మీ ఏడాది కొత్తకాపురం మరింత అన్యోన్యతగా జీవితపర్యంతము కొనసాగాలని ఆశిస్తూ…

పెళ్ళిరోజు శుభాకాంక్షలు.

ఇరువురికి ఇష్టమైతే అది ఎంత కష్టమైనా భరించవచ్చును… ఎంత కాలమైనా కలిసి మెలిసి జీవితంచవచ్చును. మీ ఇరువురి ఇష్టానికి అప్పుడే సంవత్సరకాలం… అటువంటి మీ కాపురం కలకాలం పిల్లాపాపలతో కళకళలాడాలని ఆశిస్తూ…

ఇరువురికి పెళ్ళిరోజు శుభాకాంక్షలు.

ఒకరికొకరు అనుకుని బ్రతికేస్తూ ఉంటే సంవత్సరాలు కూడా రోజులులాగా గడిచిపోతాయని మీ ఇద్దరి బంధం నిరూపిస్తూ సంవత్సరం పూర్తయిన సందర్భంగా…

మీ ఇరువురికి హ్యాపీ మ్యారేజ్ డే విషెస్

కలపడం వరకే మావంతు కలిసి ఉండడం మీవంతు… కలిసి జీవించే మీకు అండగా ఉండడం మావంతు అయితే మీరు మాత్రం వంతులు కోసం వాదులాడుకోకుండా చక్కగా కాపురం చేసుకోవాలి…

నూతన జంతకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు.

కాలక్షేపం కోసం కబుర్లాడే కొందరు సృష్టించే కలహాలు కాపురాలను కూలదోస్తాయి… కాబట్టి మీరు అలాంటి వారి మాటలను ప్రక్కన పెట్టి మీరు ఇరువురు కలకాలం కలిసి ఉండేవిధంగా ఒక అవగాహనతో ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ…

మీ కొత్త కాపుర మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగాలి.

ఇద్దరి మద్య బంధం బలపడిందంటే అది ఇద్దరి మద్య ఏర్పడిన అవగాహనే కారణం. అటువంటి అవగాహన మీకు జీవిత పర్యంతము కొనసాగాలని కోరుకుంటూ…

మీ ఇరువురికి పెళ్ళి రోజు శుభాకాంక్షలు

మీ కొత్త కాపురానికి ఏడాది కాలం అయితే మా ఆనందానికి మరింత ఆనందకరం మీ ఇద్దరి అనోన్యత…

హ్యాపీ మ్యారేజ్ డే విషెస్

మిత్రమా నీ ఆదర్శమునకు అనుకూలంగా నడుచుకునే జీవిత భాగస్వామి నీకు లభించినందుకు మిక్కిలి సంతోషిస్తూ… మొదటి వివాహావార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా

హ్యాపీ మ్యారేజ్ డే విషెస్

మీమద్య కష్టం కూడా కాలంతో బాటే కరిగిపోవాల్సిందేనని మీ దాంపత్య జీవితం తెలియజేస్తుంది. కలకాలం కలసి ఉండాలనే కాంక్షతో జీవిస్తున్న మీకు

మొదటి పెళ్ళిరోజు శుభాకాంక్షలు

బంధం బరువు అనుకునే రోజులలో ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడడమంటే, మీరు మరొక జంటకు ఆదర్శమే అవుతారు.

ఆదర్శప్రాయమైన జంటకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు

కారణంలేకుండా కొట్టుకుని విడిపోయే జంటలను కూడా చూస్తున్నాం…అలాంటి వారి దృష్టి మీపై పడకుండా ఉండాలని కోరుకుంటూ… మీరు కలకాలం కలిసి ఉండాలని ఆశిస్తూ

విష్ యు ఏ హ్యాపీ మ్యారేజ్ డే

చూడడానికి జంట ముచ్చటగా ఉంటే చూడచక్కని జంట… ప్రవర్తన కూడా మరొక జంట అనుసరించే విధంగా అది ఆదర్శప్రాయమైన దాంపత్యం…

హ్యాపీ మ్యారీడ్ లైఫ్

పదవీ విరమణ శుభాకాంక్షలు ఉద్యోగ విరమణ సందర్భంగా

బర్త్ డే విషెస్ కోట్స్ తెలుగులో Birth day wishes in Telugu

హ్యాపీ మ్యారేజ్ డే విషెస్ కోట్స్ తెలుగు

హ్యాపీ బర్త్ డే విషెస్ టు సిస్టర్

బ్రదర్ కు హ్యాపీ బర్త్ డే విషెస్

ఫాదర్ కు బర్త్ డే విషెస్ కోట్స్

మదర్ బర్త్ డే విషెస్ కోట్స్

హ్యాపీ బర్త్ డే మై సన్

విష్ యు హ్యాపీ బర్త్ డే టు మై డాటర్

హ్యాపీ బర్త్ డే విషెస్ టు ఫ్రెండ్

దర్శించండి తెలుగురీడ్స్.కామ్ బ్లాగ్

సందర్శించండి తెలుగులో వ్యాసాలు కొరకు