Happy dussehra

Happy dussehra… wishes to you and your family

మీకు మరియు మీ బంధు మిత్రులకు దసరా శుభాకాంక్షలు

అమ్మ చల్లని చూపు అమ్మ అనుగ్రహంగా భావిస్తారు. అమ్మచల్లనిచూపు వలననే అందరం హ్యాపీగా ఉంటున్నామనే భావననే పండితులు వ్యక్తం చేస్తూ ఉంటారు.

ఇవ్వడమే తెలిసిన అమ్మతనం ఉన్న అమ్మలకు అమ్మ అయిన దుర్గమ్మ కరుణ ఏది ఎవరికి ఎంత వరకు అవసరమో అంతే ఇస్తూ జీవనోద్దరణకు మార్గం చూపుతుంది… అదే శ్రేయష్కర మార్గమని అంటారు. మనకు ఏది అవసరమో అదే అమ్మ అనుగ్రహిస్తుందని అంటారు.

ఏది కలుగజేస్తే మనం పాడవుతామో, అది దూరం చేస్తుంది. ఏది అనుగ్రహిస్తే బాగుపడే అవకాశం ఉందో అదే అనుగ్రహిస్తుందని అంటారు. కానీ మనకు ఏది మంచి చెడో ఆలోచించకుండా కోరికలతో కొట్టి మిట్టాడుతామని అంటూ ఉంటారు.

నమ్మిన భక్తుడికి ఏది అనుగ్రహిస్తే మేలు కలుగుతుందో దానిని వెంటనే అనుగ్రహించే అమ్మకు కృతజ్ఙతలు…

మొదటగా శ్రేయస్సుకోరేవారిలో అమ్మ ఉంటే, అటువంటి అమ్మలకు అనుగ్రహదేవత ఆది పరాశక్తి అయిన కనకదుర్గమ్మ చల్లని చూపు మనందరిపై వర్షించాలని కోరుకుంటూ…

హ్యాపీ దసరా…. విజయదశమి శుభాకాంక్షలు..

1 comment

Leave a comment

Your email address will not be published.