హ్యాపీ బర్త్ డే విషెస్ టు ఫ్రెండ్

హ్యాపీ బర్త్ డే విషెస్ టు ఫ్రెండ్
హ్యాపీ బర్త్ డే విషెస్ టు ఫ్రెండ్

హ్యాపీ బర్త్ డే విషెస్ టు ఫ్రెండ్. ఫ్రెండుకు బర్త్ డే విషెస్ కోట్స్ తెలుగులో….

మిత్రునికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే దినం కన్నా గొప్పదినం ఏముంటుంది. ఆపదలో కూడా సాయం అందించే మిత్రునికి శుభాకాంక్షలు తెలియజేయడం అంటే మదికి మరింత ఆనందదాయకం.

హితమునే కాంక్షించేవాడు స్నేహితుడు అంటారు. అలాంటి హితుడికి పుట్టిన రోజు వస్తే ఆరోజంతా స్నేహితులు చేసే హడావుడికి హద్దే ఉండదు. ఇంకా శుభాకాంక్షలు వెల్లువ ఫ్రెండుపై కురుస్తుంది.

ఏడాదికొకమారు వచ్చే మిత్రుని జన్మదినం అంటే సంతోషించని మిత్రుండడు. ఆ సంతోషాన్ని తన మిత్రులతోనూ షేర్ చేసుకుంటూ, ఆనందంగా మిత్రుడి జన్మదినం కోసం వెయిట్ చేయడం… స్నేహంలో అదొక మాధుర్యం.

ఫ్రెండుకు హ్యాపీ బర్త్ డే విషెస్ తెలుగులో…

శ్రేయస్సుకోసం కఠినంగా మాట్లాడేవాడు మిత్రుడు. శ్రేయస్సు కోసం ప్రయత్నం చేసేవాడు మిత్రుడు.. ఇవ్వన్నీ కాదురా… స్నేహానికి అర్ధం నువ్వు…

నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

ప్రతి పరిచయమునకు కారణం కాలం అయితే మన పరిచయం స్నేహంగా మారడానికి కారణం అవసరం కాదు అవగాహన. ఇటువంటి అవగాహన ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ…

ఓ మై ఫ్రెండ్ హ్యాపీ బర్త్ డే విషెస్ టు యు.

ఈ అనంత విశ్వంలో ఎవరు ఎప్పుడు పుడతారో తెలియదు. ఎప్పుడు గిడతారో తెలియదు. కానీ ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉంటున్నారంటే అందుకు నీలాంటి మిత్రులకు కూడా కారణం అవుతారు.

ఓ నేస్తమా నీకు నా హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు.

సరదాకు సాయం చేయడం కాదు అవసరానికి సాయం చేసే నీ గుణమేరా మంచి గుణం…

మిత్రమా నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

మంచికి మంచి చెడుకు చెడు అంటూ ఉంటావ్ కానీ మిత్రునికి మాత్రం మేలునే చేస్తూ ఉండే నీ మంచి హృదయానికి మంచే జరుగుతుంది.

మనీ మనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే…

పుట్టిన ప్రతివారిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది అంటూ, అందరిలోనీ టాలెంట్ గుర్తించే నీటాలెంట్ హైలెట్… హాట్సప్ టు యు మై ఫ్రెండ్.

హ్యాపీ బర్త్ డే టు యు… మనీ మనీ హ్యాపీ రిటర్స్ ఆఫ్ ద డే.

కలగన్నట్టు ఉంది మిత్రమా నీతో పరిచయం అయ్యాక కాలం చాలా ఇష్టంగా గడిచిపోతుందంటే, నీ మాటతీరు నీ సహవాసంలో మ్యాజిక్ ఉంది మిత్రమా…

నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు...

ప్రతి పరిచయం ఏదో సందేశం ఇవ్వడానికే అన్నట్టు ఉంటే, నీ పరిచయం మాత్రం మాకు మేలుకొలుపు… నీ మార్గం అనుసరణీయం…

నీకు జన్మదిన శుభాకాంక్షలు

మంచిపని చేయాలని అనుకుంటూ ఉండేవారి మద్యలో ఉంటూ మంచిపనులే చేస్తూ ఉండే నీకు ఇలాంటి పుట్టిన రోజు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటూ…

మనీ మనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే…

కేవలం సరదాలకోసమే కాకుండా అవసరంలో సాయపడుతూ ఉండే నేస్తమా…

నీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

మంచిని చెప్పడంలోనూ చెడుని ఖండించడంలోనూ కఠినంగా వ్యవహరిస్తూ మిత్రుల శ్రేయసుకొరకు తపించే మిత్రమా నీకు

పుట్టినరోజు శుభాకాంక్షలు

పరిచయం పెరిగే కొలది మనస్పర్ధలు అధికమయ్యే బంధాలలోనూ మంచిని మాత్రమే గ్రహించే నీ తెలివికి జోహార్లు…

హ్యాపీ బర్త్ డే టు యు మై ఫ్రెండ్…. మనీ మనీ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ద డే.

కాలంలో రోజులు గడిచిపోతుంటే కొన్ని రోజులు మాత్రం మరిచపోలేము… అలాంటి రోజులలో నీ పుట్టినరోజు కూడా ఉంటుంది. నీ మేలు మరవలేను… నీ మంచి మనసుకు మనస్సుమాంజలి…

హృదయపూర్వక శుభాకాంక్షలు…విష్ యు హ్యాపీ బర్త్ డే టు యు.

ఓ మై ఫ్రెండ్ అంటూ ఎవరు సాయం అడిగినా, ఆలోచించకుండా సాయం చేసే నీగుణానికి హాట్సప్…

మనీ మనీ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ద డే.

పదవీ విరమణ శుభాకాంక్షలు ఉద్యోగ విరమణ సందర్భంగా

బర్త్ డే విషెస్ కోట్స్ తెలుగులో Birth day wishes in Telugu

హ్యాపీ మ్యారేజ్ డే విషెస్ కోట్స్ తెలుగు

హ్యాపీ బర్త్ డే విషెస్ టు సిస్టర్

బ్రదర్ కు హ్యాపీ బర్త్ డే విషెస్

ఫాదర్ కు బర్త్ డే విషెస్ కోట్స్

మదర్ బర్త్ డే విషెస్ కోట్స్

హ్యాపీ బర్త్ డే మై సన్

విష్ యు హ్యాపీ బర్త్ డే టు మై డాటర్

హ్యాపీ బర్త్ డే విషెస్ టు ఫ్రెండ్

దర్శించండి తెలుగురీడ్స్.కామ్ బ్లాగ్

సందర్శించండి తెలుగులో వ్యాసాలు కొరకు