ఫాదర్ కు బర్త్ డే విషెస్ కోట్స్

ఫాదర్ కు బర్త్ డే విషెస్ కోట్స్
ఫాదర్ కు బర్త్ డే విషెస్ కోట్స్

ఫాదర్ కు బర్త్ డే విషెస్ కోట్స్ తెలుగులో తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఎవరి జీవితంలోనైనా నాన్న రియల్ హీరోగా ఆదర్శంగా నిలుస్తాడు. బిడ్డను కనడానికి తల్లి మరణంతో పోరాటం చేస్తే, తండ్రి విలువలతో కూడిన జీవితం బిడ్డలకు అందించడానికి సమాజంతో పోరాటం సాగిస్తూనే ఉంటాడు. అటువంటి తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి నాన్నకు ప్రేమతో కొన్ని కోట్స్…

నాన్నకు నాన్నే సాటి, నాన్నే నాహీరో…

మనీ మనీ రిటర్న్స్ ఆఫ్ ద డే

అమ్మను మించిన దైవంలేదు నాన్న మించిన హీరో లేడు

నాన్నకు హ్యాపీ బర్త్ డే విషెస్

ఆశయంలో తండ్రి మార్గదర్శకుడు అయితే నాన్నగారు మీవలననే నాజీవితానొక మంచి ఆశయం ఏర్పడింది… మీ జన్మదినం శుభ సందర్భంలో…

పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఆస్తి కన్నా విలువలు ప్రధానమంటూ జీవించిన నీ జీవితం మాకు ఆదర్శవంతం…

మనీ మనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే

కోట్ల ఆస్తి కన్నా విలువైన విలువలను మాకు ఒంటబట్టించుకునే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దిన నాన్నగారే మాకు మార్గదర్శకం…

ప్రియమైన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

నువ్వు నడిచిన ముళ్ళబాట నేడు మాకు రహదారిగా మారింది… నీ కష్టానికి మా నమస్కారం

నాన్నకు జన్మదిన శుభాకాంక్షలు

నా జీవన ప్రయాణం మొదలు కావడానికి ఆది నుండి కష్టపడి నన్నింతవాడిని చేసిన నాన్నగారికి నా హృదయపూర్వన నమస్కారములు… నేడు మీ పుట్టినరోజు సందర్భంగా మీకు

పుట్టిన రోజు శుభాకాంక్షలు

దిక్కుతోచని స్థితిలో మీ మాటలు మనసుకు బలం అయితే, కష్టాలలో మీ పట్టుదలే మాకు మార్గదర్శకం… మీ జన్మదినం సందర్భంగా…

మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు

కాలం ఇచ్చే కష్టంలోనూ, కాలం తీసుకుచ్చే సుఖసంతోషాలలోనూ సమదృష్ఠితో ఎలా ఉండాలో మీకు నేర్పించిన నాన్నగారికి ఎప్పటికీ ఆదర్శం…

మనీ మనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే

నన్ను తండ్రికి తగ్గ తనయుడు అనడానికి నాకు తనయుడు పుట్టేవరకు లోకం వేచి చూసిందంటేనే అర్ధం అవుతుంది… మీరు మీ చుట్టూ ఉన్న సమాజంలో ఎంత గౌరవం పొంది ఉన్నారో… అంత సులభం కాదు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడం…

హ్యాపీ బర్త్ డే విషెస్ టు మై డియర్ ఫాదర్

ఆశయం, ఆదర్శం, లక్ష్యం, నిశ్చయం, పట్టుదల, సాధన… మొదలైన పదాలకు అర్ధం తెలుసుకోవడం అనవసరం… మిమ్మల్ని అనుసరిస్తే చాలు.

నాకు మార్గదర్శకంగా నిలిచిన నాన్నగారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు