బాలల దినోత్సవ శుభాకాంక్షలు కోట్స్

బాలల దినోత్సవ శుభాకాంక్షలు కోట్స్
బాలల దినోత్సవ శుభాకాంక్షలు కోట్స్

బాలల దినోత్సవ శుభాకాంక్షలు కోట్స్ తెలుగులో

ఎదిగే వయస్సులో నేర్చుకునే చోట ఉండడం ఒక వరం అయితే, దానిని సద్వినియోగ చేసుకోవడం యోగం… కాలం వృధా చేయకు మంచి విషయాలు నేర్చుకో…

బాలల దినోత్సవ శుభాకాంక్షలు

వచ్చే వచ్చే వయస్సులో వేరు వేరు విషయాలు వస్తుంటాయి, పోతుంటాయి నీవు గ్రహించేది నీకు తోడు అయితే మంచిని గ్రహించడం ప్రధాన విషయం.

బాలల దినోత్సవ శుభాకాంక్షలు

నిత్యం వెన్నంటి ఉండే కాలం బాల్యం. అటువంటి బాల్యంలో బాగా చదువుకోవడం ఉత్తతమైన లక్షణం.

బాలల దినోత్సవ శుభాకాంక్షలు

అల్లరి చేయడం అవసరమే అయితే అది అలవాటుగా మారిపోతే ప్రమాదం… అల్లరిని అదుపు చేయి, మైండును చదువుపై పెట్టు.

బాలల దినోత్సవ శుభాకాంక్షలు

వినడమనే ప్రధాన గుణముండబట్టే నేర్చుకునే ఆలయంలో అంటే విద్యాలయంలో చోటు లభించింది… ఆ చోటులో విజయుడుగా నిలబడు.

బాలల దినోత్సవ శుభాకాంక్షలు

సమాజం ఎలా ఉన్నా, కలసి మెలసి ఉండవలసిన చోటు విద్యాలయం. ఇక్కడంతా ఒక్కటే, అందరూ నేర్చుకునేవారు మంచిని గ్రహించడం ఉత్తమ లక్షణం.

బాలల దినోత్సవ శుభాకాంక్షలు

చోటును బట్టి ఫీలింగ్స్ మారితే, విద్యాలయంలో నేర్చుకోవాలనే భావన బలపడాలి… లేకపోతే సరైన సాధన చేసి విద్యపై దృష్టిపెట్టాలి.

బాలల దినోత్సవ శుభాకాంక్షలు

ఎదిగే వయస్సులో గొప్పవారి గురించి చదవడం ఒక ఎత్తైతే, ఎవరో ఒకరిని ఆదర్శంగా ఎంచుకోవడం మరొక ఎత్తు… మంచివారిని అనుసరించు మంచి మార్గం లభిస్తుంది.

బాలల దినోత్సవ శుభాకాంక్షలు

పద్యాలలో కూడా మంచినే చెబుతారు. వచనంలో కూడా మంచినే చెబుతారు అంటే గుర్తించు మంచి అంటే ఎంతమందికిష్టమో…

బాలల దినోత్సవ శుభాకాంక్షలు

పట్టుదల పనికిమాలిన విషయాలలో కాదు, మంచి విషయాలను సాధించడంలో జీవితంలో లక్ష్య సాధనకు విషయ సంగ్రహణం చేయడంలో చూపించాలి.

బాలల దినోత్సవ శుభాకాంక్షలు

అందరూ చదువుతున్నారు… కొందరికే మంచి మార్కులు… ఎందుకు ? ఆలోచించు… శోధించు అవగాహననలోపం గ్రహించు… అవగాహన కోసం పరితపించు… సాధించు మంచి మార్కులు.

బాలల దినోత్సవ శుభాకాంక్షలు

వయస్సుకు తగ్గ పనులు అంటే బాల్యంలో వినడం, సాధన చేయడం అదే ప్రధమ కర్తవ్యం.

బాలల దినోత్సవ శుభాకాంక్షలు

పుస్తకంలోని విషయం గ్రహించడం కన్నా టీచర్ చెప్పే వివరణ గ్రహించడం సులభం కాబట్టి క్లాసు మిస్ కాకుడదు.

బాలల దినోత్సవ శుభాకాంక్షలు

ఆడుతూ పాడుతూ చదువుకుంటూ అద్భుతమైన బాల్యం ఆనందమయం నిత్య సంతోషలైన బాలలందరికీ

బాలల దినోత్సవ శుభాకాంక్షలు

ఏది ఎక్కువగా లభిస్తుందో అది మనిషి మనుగడకు అవసరం అటే గాలి చాలా ఎక్కువగా లభిస్తుంది… గాలి లేకుండా మనిషి ప్రాణం నిలబడదు… అలాగే బాల్యంలో ఎక్కువగా వినబడే నీతి వ్యాక్యాలు జీవితంలో మేలుకొలుపు కాగలవు.

బాలల దినోత్సవ శుభాకాంక్షలు

అప్పుడప్పుడు అపజయాలు వచ్చేది వాటిని అలవాటు అవ్వడానికి కాదు అపజయానికి కారణాలు అన్వేషించి ఆలోచించి, అవగాహన ఏర్పరచుకుని అద్భుతవిజయం సాధించడానికి…

బాలల దినోత్సవ శుభాకాంక్షలు

బాల్యంలో బరువుగా భావించే బాధలుండవు కానీ బాల్యంలో కష్టపడి చదివితే, జీవితం సుఖవంతంగా సాగుతుంది.

బాలల దినోత్సవ శుభాకాంక్షలు

నేటి బాలలే రేపటి పౌరులు అయితే నేటి మీ అవగాహనా శక్తే మీకు శ్రీరామరక్ష

బాలల దినోత్సవ శుభాకాంక్షలు

నేర్చుకునే వయస్సులో చూడవలసినది నేర్పించేవారి గుణాలు కాదు నేర్పించేవారి విషయ విజ్ఙానం.

బాలల దినోత్సవ శుభాకాంక్షలు

పరమ పవిత్రమైన స్థలంలో కూడా పవిత్రమైన మనసుంటే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు… ఎంత విద్యాలయం అయినా నేర్చుకునే శ్రద్దలేకపోతే విద్యార్ది దశ నిరర్ధకం అవుతుంది.

బాలల దినోత్సవ శుభాకాంక్షలు

పుస్తకంలోని విషయాలను గ్రహించడమే కాదు లోపల నీ మనసు ఏమి తలుస్తుందో గమనించు… మంచి విషయం అయితే సాధనకు ప్రయత్నించు…

బాలల దినోత్సవ శుభాకాంక్షలు